Posts

Showing posts from November, 2017

its not a padha yathra its a public assembly says his party followers.

Image
పాదయాత్ర కాదు... ప్రజా అసెంబ్లీ! అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగితె పాదయాత్రలో ప్రజా అసెంబ్లీ జరగాలని జగన్ శ్రేణులు కోరుకుంటున్నాయి. తద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రజలనే ప్రజా ప్రతినిధులను చేస్తూ, అసెంబ్లీలో అధికార పక్ష నాయకులు అడ్డగోలుగా చెప్పుకునే గొప్పలను, అవాస్తవాలను ప్రజా అసెంబ్లీలో ప్రజల ద్వారానే తిప్పికొట్టించాలని వైస్సార్సీపీ నాయకుడు రఘురామ్ రెడ్డి సూచించారు. ఇందుకు స్పెషల్ స్క్రీన్ లను ఏర్పాటు చేయించి, జగన్ మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధాన్ని చెప్పాలి. ప్రతిపక్షమంటే ప్రజల గొంతు. నాలుగేళ్లపాటు అసెంబ్లీలో ప్రజల గొంతును నొక్కిపెట్టారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రతిపక్షం పై చిల్లర, చవకబారు వ్యూహాలకు తెరతీశారు. అటు మీడియాలో, ఇటు అసెంబ్లీలో ప్రజల గొంతును తొక్కిపెడుతూ ఇక అడ్డులేదనుకుంటూ ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రజలకు ఏం లబ్ది జరిగిందో అర్ధంకావడం లేదు. స్వల్ప సమయంలోనే అప్పులతో రాష్ట్రాం గాయాల పాలవడం మాత్రం కళ్ళముందే కనబడుతోంది. రాష్ట్రం అసలు ఇక కోలుకుంటుందా అన్న సందేహం కలుగుతోంది. ఇప్పుడు ప్రజల గొంతును ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాదు, ఆ ప్రజలే ప్ర